Subscription Service

All Ads in Telugu

సరఫరా పెరగడంతో క్షీణించిన నువ్వుల ధరలు

చెన్నై : దేశంలో మార్చి 6 నాటికి 50 వేల హెక్టార్లతో పోలిస్తే 49 హెక్టార్లు, గుజరాత్లో మార్చి 9 నాటికి 34,726 హెక్టార్లకు గాను 50,648 హెక్టార్లకు చేరింది. దేశంలో రబీ మరియు యాసంగి సీజన్ నువ్వుల సేద్యం పెరిగినందున నిల్వ వ్యాపారులు అప్రమత్త మయ్యా రు. తద్వారా కిరాణా వ్యాపారులు మరియు నూనె మిల్లర్ల అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 2500–3000 వేల బస్తాల నువ్వుల రాబడిపె రూ. 200-250 తగ్గి తెల్లనువ్వులు హళ్లింగ్ సరుకు రూ. 8500-9250, 98.2 2 9125-9400, 99.1 శాతం రూ. 9600-9875, నాణ్యమైన సరుకు రూ. 9900-10,100 మరియు 800 - 1000 బస్తాల నల్ల నువ్వులు క్రషింగ్ సరుకు రూ. 5500-7000, జడ్ బ్లాక్ రకం రూ. 20,000-22,500, యావరేజ్ రూ. 14,000–20,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం 300-400 బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 8800–9800, గ్వాలియరలో తెల్ల నువ్వులు 99.1 రకం రూ. 9600 మరియు 1200-1500 బస్తాల హల్లింగ్ సరుకు రాబడి కాగా రూ. 9400 ధరతో వ్యాపారమెంది. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట, బద్వేలు, కడప, ఒంగోలు, రాజంపేట ప్రాంతాలలో 2000-2500 బస్తాల సరుకు రాబడి కాగా, ఎర్రనువ్వులు కొత్త సరుకు రూ. 9000-10500, తెల్లనువ్వులు రూ. 10,800 ప్రతి క్వింటాలు మరియు 75 కిలోల బస్తా రూ. 7850-8250 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని శివగిరిలో 1200-1500 బస్తాల సరుకు రాబడి కాగా, నల్ల నువ్వుల రూ. 13800-16,500, ఎర్రవి రూ. 11,560-12,869 మరియు కొడుముడిలో నల్ల నువ్వులు రూ. 12,200-15,200 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది.

Updated On: March 16, 2026, 2:05 pm
నిల్వ వ్యాపారుల కొనుగోళ్లతో బలోపేతం చెందుతున్న బెల్లం ధరలు

హైదరాబాద్ : దేశంలో ప్రస్తుతం బెల్లానికి పెరుగుతున్న డిమాండ్తో పాటు నిల్వ వ్యాపారుల కొనుగోళ్లు కొనసాగుతున్నందున ధరలు ఊపందుకున్నాయి.ముజఫర్నగర్ లో గత వారం 18-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1525-1693, రస్కట్ అచ్చులు రూ. 1500-1522, ముద్ద బెల్లం రూ. 1580-1644, ఖుర్పా రూ. 1485-1500 మరియు పాపి 100 కిలోలు రూ.4100–4150, హాపూర్లో 10 నుండి 12 వాహనాలు బకెట్ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1475 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో 12 వేల దిమ్మలు, సాంగ్లీలో 5 నుండి 6 వేల దిమ్మలు, సోలాపూర్లో 10 నుండి 12 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, రూ. 3800-4200, కొల్హాపూర్లో 18-20 వేల దిమ్మలు రూ. 4000–5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో సంతరోజు 22 నుండి 24 వేల దిమ్మల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4600-4700, మీడియం రూ.4300-4350, నలుపు రకం రూ. 4050-4100, చిత్తూరులో 20 నుండి 22 వాహనాల సరుకు రాబడి కాగా, ఆర్గానిక్ బెల్లం రూ. 5000-5050, సురభి నాణ్యమైన సరుకు రూ. 4700-4850, మీడియం నలుపు రకం రూ. 4200-4250 ధరతో వ్యాపారమెంది. కర్ణాటకలోని శివమొగ్గ, మహాలింగపూర్, విజయపుర మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 32 నుండి 35 వాహనాల సరుకు రాబడిపై 10 కిలోల దిమ్మల బెల్లం రూ. 3980-4050, 5 కిలోలు దిమ్మలు రూ.4100-4170, 1 కిలో దిమ్మలు రూ. 4050-4130, అర కిలో దిమ్మలు రూ.4240-4250 మరియు మధ్యప్రదేశ్లోని బైతుల్లో 800 నుండి 1000 క్వింటాళ్ల సరుకు రాబడి పై 3625-3875 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం సరుకు దిమ్మలు రూ.5500-5600, సాంగ్లీ సరుకు 10 కిలోల దిమ్మలు బిల్టి బెల్లం రూ. 4800- 4900, ఒక కిలో దిమ్మలు రూ.4900-5000, అరకిలో దిమ్మలు రూ. 5000-5100, మహారాష్ట్ర ముద్దబెల్లం రూ. 4600-4700, మంగుళూరు సరుకు రూ. 4800 - 4900 ధరతో వ్యాపారమైంది.

Updated On: March 16, 2026, 2:01 pm
మెంతులు

మెంతులు జావ్రా : రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉత్పాదక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో గత వారంలో నాలుగు రోజులు నిర్వహించిన మార్కెట్లో దాదాపు 80 వేల బస్తాల రాబడి అయ్యాయి. పొరుగు రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు జోరందుకున్నందున సార్టెక్స్ సరుకు ధరలకు మద్దతు లభిస్తున్నది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో 12 వేల బస్తాల కొత్త మెంతుల రాబడిపై సాధారణ రకం రూ. 4400-4700, మీడియం రూ. 5000-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: April 21, 2025, 6:51 am
పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు

పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 17, 2025, 7:00 am